బాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన హీరో ధర్మేంద్ర(dharmendra)1960 లో 'దిల్ బి తేరా హమ్ బీ తేరే' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ధర్మేంద్ర ఆ తర్వాత పూల్ ఔర్ పత్తర్, హుకుమత్, వీరు దాదా, నక బండి, ఫరిస్తాయ్,తెహల్కా,క్షత్రియ,మైదాన్ ఈ జంగ్,ధర్మకర్మ వంటి హిట్ చిత్రాలతో హీ మ్యాన్ అనే టాగ్ లైన్ ని కూడా పొందాడు.అమితాబ్ తో కలిసి చేసిన మల్టిస్టారర్ మూవీ "షోలే' అయితే ఒక ప్రభంజాన్ని కూడా సృష్టించింది.
ఇక రీసెంట్ గా సుశీల్ కుమార్ అనే ఒక బిజినెస్ మాన్ ధర్మేంద్ర తనకి ఉత్తరప్రదేశ్ లోని'గరం దరం దాబా' అనే ప్రాంజైజీ ని ఇస్తానని చెప్పి అరవై మూడు లక్షల వరకు తీసుకొని మోసం చేసాడని కేసు నమోదు చెయ్యటంతో ఢిల్లీ కోర్టు ధర్మేంద్ర కి సమన్లని పంపించడం జరిగింది.ధర్మేంద్ర తో పాటు మరో ఇద్దరకీ కూడా సమన్లు పంపించిన కోర్టు ఫిబ్రవరి 20 కి కేసుని వాయిదా వేసింది.
ధర్మేంద్రకి గరం దరం దాబా' అనే పేరుతో హర్యానా,ఉత్తరప్రదేశ్,ఢిల్లీ వంటి ఏరియాల్లో హోటల్స్ ఉన్నాయి.ఇక ధర్మేంద్ర తనయులు సన్నీడియోల్(sunny deyol)బాబీడియోల్(bobby deyol)లు హీరోలుగా అనేక చిత్రాల్లో నటించి అశేష అభిమానులని సంపాదించుకున్నారు. బాబీడియోల్ అయితే ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేస్తు నటుడిగా తన సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గా యానిమల్ కంగువాలో చేసి మెప్పించిన బాబీడియోల్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్టు హరిహరవీర మల్లులో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.